ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి.. శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

TG NEWS 24 | చందూర్ మండల కేంద్రంలో చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మోటార్లను ప్రారంభించి, ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చందూర్ మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అతిథులు పంపిణీ చేశారు.

చందూర్ బస్టాండు వద్ద బాన్సువాడ-నిజామాబాద్ రహదారిపై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.