విద్యార్థిని విజయాన్ని అభినందించిన MRPS, గ్రామ నాయకులు

బీర్కూర్, సెప్టెంబర్ 10:(TGNEWS24)

బీర్కూర్ మండలానికి చెందిన విద్యార్థిని NEET పరీక్షలో ఉత్తీర్ణత సాధించి MBBS సీటు పొందిన సందర్భంగా ఆమెను స్థానికంగా ఘనంగా సన్మానించారు. విద్యలో ప్రతిభ కనబరిచి వైద్య విద్యలో ప్రవేశం పొందిన విద్యార్థినిని పలువురు అభినందించారు.ఈ సందర్భంగా MRPS బీర్కూర్ మండల అధ్యక్షులు మెక్క రమేష్ మాదిగ, సలహాదారు రాంసాని బుమయ్య, కోశాధికారి నాని బాబు తదితరులు విద్యార్థినిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.విద్యార్థిని తల్లిదండ్రులు గవ్వల సతీష్ – గంగలత దంపతులు. తమ కుమార్తె NEETలో ఉత్తీర్ణత సాధించి MBBS సీటు పొందడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ, BRS టౌన్ ప్రెసిడెంట్ చీదరి బాలకృష్ణ, గొల్ల సాయిలు, కొర్రి కృష్ణ, బొజ్జ వీరేశం, ఖాజా ఖాన్, అక్బర్‌తో పాటు BRS నాయకులు, యువకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.విద్యార్థిని సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.